విశాఖ ఎక్స్ ప్రెస్ రైలులో విశాఖ ఎక్స్ ప్రెస్ రైలులో మహిళ పై అత్యాచారం
విశాఖ ఎక్స్ ప్రెస్ రైలులో విశాఖ ఎక్స్ ప్రెస్ రైలులో మహిళ పై అత్యాచారం
విశాఖ ఎక్స్ ప్రెస్ రైలులో విశాఖ ఎక్స్ ప్రెస్ రైలులో మహిళ పై అత్యాచారం


అమరావతి, 29 ఏప్రిల్ (హి.స.)

విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. బుధవారం ఈ ఘటనలో బాధిత మహిళకు రాయపాటి శైలజ వీడియో కాల్ చేసి.. ఫోన్లో పరామర్శించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా రాయపాటి శైలజ స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాయపాటి శైలజ.. బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు.

పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన దంపతులు ఉపాధి నిమిత్తం విశాఖపట్నంలో నివసిస్తున్నారు. గత ఆదివారం సాయంత్రం వివాహిత విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించింది. గుర్తు తెలియని వ్యక్తి జనరల్ బోగిలో ఉన్న ఆమెను ఏసీ బోగిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

బాధిత మహిళ.. రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ అత్యాచార ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ అత్యాచార ఘటన బహిర్గతం కావడంతో ఈ ఘటనపై రెంటచింతల పోలీసులతో మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని పోలీసులకు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande