గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం, దేశం బాగుపడ్తుంది.. మంత్రి వాకిటి శ్రీహరి.
గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం, దేశం బాగుపడ్తుంది.. మంత్రి వాకిటి శ్రీహరి.
Minister


నారాయణపేట, 29 ఏప్రిల్ (హి.స.) Wi

గ్రామాలు బాగుపడితేనే ప్రాంతం రాష్ట్రం దేశం బాగుపడ్తుందని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభి వృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

మక్తల్ మండలం గోలపల్లి నుండి మంథన్ గోడ్ రోడ్డుకు ఒక కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన నూతన వంతెన నిర్మాణానికి గొల్లపల్లి సర్పంచ్ సూర్య కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాల అభివృద్ధి గురించి పాలకులు పట్టించుకోలేదని.. అభివృద్ధి నిధుల పేరుతో తెలంగాణ వచ్చాక మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి గురించి తెరాస ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండున్నర ఏళ్లలో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టి ఇప్పటి వరకు వందల కోట్ల విలువైన పనులకు నిధులను మంజూరు చేయించా అని అన్నారు. అందులో కొన్ని విడుదల జరిగాయని, అందులో కొన్నిపనులు నిర్మాణం జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇన్ని జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పడకేసిందని, పనులు జరగడం లేదని అంటున్న కొందరు నాయకులు కళ్ళు తెరిచి చూడాలని ఆయన హెడ్డేవా వేశారు.

రోడ్ల గ్రామాల్లో అంతర్భాగం డ్రైనేజీలు రోడ్లు పెద్దగా ఉంటేనే గ్రామాలకు గౌరవం పెరుగుతుందన్నారు. విస్తరణలో తన సొంత ఇల్లు అడ్డం వచ్చినా తొలగించాలని పేదవాళ్లు ఇండ్లు కోల్పోతే వారికి ఇండ్లు మంజూరు చేస్తామని హామీ నిచ్చారు. గ్రామాల అభివృద్ధికి మీ అందరి సహకారం ఉంటే గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు.

ఎన్నికలప్పుడే రాజకీయాల గురించి చర్చించాలని గ్రామాల్లో ప్రజలు రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు తద్వారా దేశం బాగుపడుతుందని.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande