విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిలు.. రూ.వెయ్యి కోట్లు విడుదల
తెలంగాణ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది
Telangana logo


హైదరాబాద్, 29 ఏప్రిల్ (హి.స.)తెలంగాణ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ వరకు పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను క్లియర్ చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల పై కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులతో చర్చ వేళ ప్రభుత్వం నెలకు రూ. 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా మార్చి 2026 వరకు ప్రతినెల ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం అమలు చేసింది. కాగా, ఇప్పుడు ఏప్రిల్ నెల చెల్లింపుల్లో భాగంగా ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ వరకు పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను క్లియర్ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande