మార్కాపురం జిల్లాలో బీభత్సం సృష్టించిన గాలివాన
మార్కాపురం జిల్లాలో బీభత్సం సృష్టించిన గాలివాన
మార్కాపురం జిల్లాలో బీభత్సం సృష్టించిన గాలివాన


మార్కాపురం, 29 ఏప్రిల్ (హి.స.) జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి వేర్వేరు చోట్ల ఇద్దరు మరణించగా, కోళ్లఫాం షెడ్డు కూలి మరొకరు మృతి చెందారు. కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. మార్కాపురం జిల్లాలో రాత్రి గంటపాటు ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో వాన కురవడంతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మార్కాపురం రూరల్ మండలం బోడపాడు గ్రామానికి చెందిన ఒంటేరు పుల్లమ్మ(47) భర్త కొండయ్య, మరో మహిళ పాసాని రంగలక్షమ్మతో కలిసి పొలం పనులకు వెళ్లారు. వర్షం ప్రారంభమవడంతో ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపడి పుల్లమ్మ మృతిచెందారు. పొసాని రంగలక్షమ్మకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే, బేస్తవారపేట మండలం గంటాపురం గ్రామంలో మొక్కజొన్న కంకులు గ్రేడింగ్ పనులకు వెళ్లిన డోలా శోభారాణి(35) పిడుగుపాటుకు మృతిచెందారు. మార్కాపురం రూరల్ మండలం బోడపాడు సమీప పెద్దయాచవరం రోడ్డులోని ఎస్సీ కాలనీలో గాలివానకు కోళ్లఫాం షెడ్ కూలి చింతగుంట్ల కుమారి(60) మృతిచెందారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande