
కర్నూలు, 29 ఏప్రిల్ (హి.స.) ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool Districi) వ్యాప్తంగా అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి తోడు...ఈదురు గాలులు బలంగా వీచటంతోభారీ వృక్షాలు నేలకొరిగాయి. అదేవిధంగా చాలాచోట్ల కరెంటు స్తంభాలు సైతం పడిపోవడంతో చాలా గ్రామాలకు విద్యుత్ అంతరాయం (Electricity Porblem) ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం సమీప గ్రామాల్లో కొన్ని వందల ఎకరాల్లో అరటి తోటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అకాల వర్షాలకురైతులకు తీవ్రంగా నష్టపోయారు. దీంతో నంద్యాల జిల్లా మహానంది మండలంలో ఈ వానలు రైతులకు కన్నీరు మిగిల్చాయి.మండలంలోని బుక్కాపురం ,మహానంది, తిమ్మాపురం,గోపవరం వంటి తదితర గ్రామాల్లో అరటి తోటలో పూర్తిగా ధ్వంసమయ్యాయి. చేతికి వచ్చిన అరటి పంటలు గాలి, వానకు నేలకొరగటంతోరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో కొన్ని వందల ఎకరాలలో అరటి తోటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.
బేతంచెర్ల మండలంలో కురిసిన అకాల వర్షం, గాలులతో కూడిన వాతావరణం వల్ల అరటి తోటలు నేలకూలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రుద్రవరం గ్రామానికి చెందిన రైతు నాగరాజు తన 3 ఎకరాల అరటి పంట పూర్తిగా దెబ్బతినడంతో సుమారు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. చేతికి వచ్చే సమయంలోనే పంట నేలరాలడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి తోటల మధ్య ఉన్న అరటి పంట కూడా భారీగా దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV