
టంగుటూరు:, 29 ఏప్రిల్ (హి.స.)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కిలో పొగాకుకు రూ.360 చొప్పున మద్దతు ధర కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించి, వారిని ఆదుకోవాలని కోరుతూ టంగుటూరు పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ముందుగా వేలం ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఏడాది బ్యారనుకు రూ.4 లక్షల వరకు రైతులు నష్టపోయారన్నారు. ఈ ఏడాది రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది సగటు ధర రూ.220గా ఉంటే.. ప్రస్తుతం గరిష్ఠ ఆరంభం ధర రూ.210గా నిర్ణయించారు. రాష్ట్రంలో నాణ్యమైన దిగుబడులు ఉన్నప్పటికీ, ఉత్పత్తి పెరగలేదు. అయినప్పటికీ తక్కువ ధరలకు కొనుగోలు చేసి మార్కెట్ను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ