
హైదరాబాద్, 29 ఏప్రిల్ (హి.స.)
డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినంత సులువు అయిపోయిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీపై ఇవాళ ఆయన స్పందించారు. కవితతో ఊదు కాలదు, పీరు లేవదన్నారు. మొదటి సమావేశంలోనే కవిత తన తండ్రి కేసీఆర్ను విమర్శించి మర్యాద పోగొట్టుకున్నారని విమర్శించారు. ఉద్యమకారుడు కేసీఆర్ను కవిత విమర్శించడం బాధేసిందని, తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుందని ప్రశ్నించారు. తన అన్న మీద ఉన్న కోపం తండ్రి మీద తీయడాన్ని తప్పుబడ్డారు.
ఉద్యమకారుడి బిడ్డగా కవితకు గుర్తింపు ఉందని, పార్టీ కాదు... కవిత పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. టీఆర్ఎస్ పేరు మీదనే పార్టీ పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మద్యం కుంభకోణం కేసులో కవితకు క్లీన్ చిట్ రాలేదని చెప్పారు. ఇక తన మంత్రిపదవిపై స్పందిస్తూ అధిష్టానం నాకు హామీ ఇచ్చిందన్నారు. నాకు మంత్రి పదవి ఇస్తే కచ్చితంగా ఆ పదవికి న్యాయం చేస్తానని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..