ఆధునిక టెక్నాలజీ వినియోగించడం ద్వారా జనగణన ప్రక్రియ మరింత సులభతరం.. ఎమ్మెల్యే గూడెం
ఆధునిక టెక్నాలజీ వినియోగించడం ద్వారా జనగణన ప్రక్రియ మరింత సులభతరం.. ఎమ్మెల్యే గూడెం
Mla


సంగారెడ్డి, 29 ఏప్రిల్ (హి.స.)

జనగణనలో ప్రతిఒక్కరూ పాల్గొని దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం తన నివాసంలో స్వీయ జనగణనను ప్రారంభించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని.. ఖచ్చితమైన వివరాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం సమర్థవంతమైన సంక్షేమ పథకాలు రూపొందించడంలో ఉపయోగపడుతుందన్నారు.

ఆధునిక టెక్నాలజీ వినియోగించడం ద్వారా జనగణన ప్రక్రియ మరింత సులభతరమైందన్నారు. ప్రజలు యాప్ ద్వారా స్వీయ జనగణన సైతం చేసుకోవచ్చని తెలిపారు. అధికారులు ఇళ్లకు వచ్చిన సమయంలో పూర్తి వివరాలు అందించాలని.. ఎటువంటి గోప్యతకు చోటు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా బడుగు బలహీన వర్గాల జీవన స్థాయి ప్రమాణాలు, వెనుకబాటుతనం, విద్య స్థాయి, తదితర అంశాలపై స్పష్టమైన సమాచారం లభిస్తుందన్నారు. ప్రజలు అందించే ప్రతి సమాచారం పూర్తి భద్రతతో ఉంటుందని తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande