పార్లమెంట్ ఉభయసభల వాయిదా పొడగింపు
పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పొడగింపు,ఏప్రిల్ 16 నుండి బడ్జెట్ సమావేశాలు
PARLIAMENT BUDGET SESSION


ఢిల్లీ , 03 ఏప్రిల్ (హి.స.)

పార్లమెంట్ ఉభయ సభలు గురువారం వాయిదా పడ్డాయి. అయితే అసాధారణ రీతిలో వాటిని పొడిగించారు. దీంతో స్వల్ప విరామం తర్వాత ఏప్రిల్ 16న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒక పక్క దేశంలోని ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల సందడి నెలకొనగా, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు, లోక్సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 816కు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లేదా నారీ వందన్ అధినియం, 2023ను ఎలాగైనా ఆ సమావేశాల్లో ఆమోదించాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. వాస్తవానికి మార్చి 9న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల రెండవ భాగం ఏప్రిల్ 2న ముగియాల్సి ఉన్నప్పటికీ, కార్యకలాపాలు ముగిసిన తర్వాత ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేయలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande