కేరళలో కూడా ఆరుగ్యారెంటీల పథకం...మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన
తెలంగాణ తరహాలోనే ఆరుగ్యారెంటీ పథకాలను కేరళలో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టో
Congress.Flag


కేరళ, 03 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణలో అధికారం కోసం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసినట్టే.. కేరళ ప్రజలను కూడా వంచించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళలో ‘ఐదు గ్యారెంటీల’ను ప్రకటించింది. మన దగ్గర మాదిరిగానే ‘ఇందిరమ్మ’ పేరు పెట్టింది. గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన రాహుల్గాంధీ, రేవంత్రెడ్డే కేరళలోనూ 5 గ్యారెంటీలు, 420 హామీలను ప్రకటించడం గమనార్హం.

నమ్మించి, వంచించి అయినా అధికారం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ‘గ్యారెంటీల గారడీ’ ప్రక్రియను గతంలోనే తిరువనంతపురంలో ప్రారంభించారు. దానికి కొనసాగింపుగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మలయాళీలను మాయ చేసేందుకు గురువారం కొజికోడ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు

కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) అధికారంలోకి వస్తే ఐదు మౌలిక సంక్షేమ గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. పేదల పెన్షన్ను నెలకు రూ.3వేలకు పెంచుతామని, ఒకో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అమలు చేస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, కాలేజీకి వెళ్లే ఆడపిల్లలకు నెలకు రూ.వెయ్యి సాయం అందిస్తామని, యువతకు రూ.5లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ వాచ్ టవర్లను ఏర్పాటు చేస్తామంటూ పలు హామీలను గుప్పించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande