
కేరళం, 03 ఏప్రిల్ (హి.స.)
కేరళం అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఈ నేపథ్యంలో బడా నేతలందరూ ఆ రాష్ట్రంలో పర్యటించి, ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు ప్రధాన మోడీ కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ పేరును ప్రస్తావిస్తూ ప్రశంసలు వర్షం కురిపించారు మోడీ.
భారత క్రికెటర్ సంజు శాంసన్ లాగా ముందుకు వెళ్లాలని బీజేపీ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. సంజు శాంసన్ ఆట తీరును ప్రశంసించారు. వరల్డ్ కప్ నాకౌట్ లో సంజు శాంసన్ చెలరేగి ఆడాడని గుర్తు చేశారు. అతని ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం మరింత బలపడ్డాయని ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతి క్రీడాకారుడికి ఈ లక్షణాలు ఉండాల్సిందేనని.. అప్పుడే విజయం మన ముంగిటకు వస్తుందని తెలిపారు.
భారత జట్టుకు అవసరమైనప్పుడల్లా గొప్ప ఆటగాడు రాణిస్తాడని, సంజు కూడా అలాగే వ్యవహరించడానికి వెల్లడించారు. అదే సమయంలో ఓటింగ్ రోజున కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటిని చేరుకోవాలని దిశా నిర్దేశం చేశారు. మీ అంకితభావం అత్యంత ముఖ్యమన్నారు. విజయం కోసం అదనంగా పనిచేయాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ. సంజు తరహాలోనే పనిచేసి, పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు