కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన.. గజమాలతో ఘన సత్కారం
కర్ణాటక రాయచూర్ లో మినిస్టర్ నారా లోకేష్ పర్యటిస్తున్నారు
నారా లోకేష్


రాయచూర్, 04 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో పర్యటిస్తున్నారు. స్థానిక తెలుగు యువత ఆయనకు ఘనస్వాగతం పలికారు.

గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డు వరకూ ర్యాలీ కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయగా.. ఆ అరెస్టును నిరసిస్తూ సింధనూరులో ర్యాలీలు చేపట్టారు.

ఆ సమయంలో తమకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపేందుకు లోకేష్ కర్ణాటకకు వెళ్లారు. అలాగే సింధనూరు హోసళ్లీలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో లోకేష్ పాల్గొంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande