
నంద్యాల,: 05 ఏప్రిల్ (హి.స.)
‘రాబోవు రోజుల్లో రాయలసీమలో హార్టీకల్చర్ హాబ్ కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇది భవిష్యత్లో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో బలమైన అభివృద్ధికి దారి తీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్గా మారుతుంది’ అని నంద్యాల జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర విభజనతో పాటు వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. సూపర్-6 హామీలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కానీ ఇవేమీ పట్టనట్టుగా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి పయ్యావుల విమర్శించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ భవనంలో 2026-27 బడ్జెట్ అవుట్రీచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ః. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 3.32 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధి, లక్ష్యాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేశాం అనిచెప్పారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ