
గుంటూరు,05 ఏప్రిల్ (హి.స.)
రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకొచ్చే వారికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. గుంటూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సహజసిద్ధమైన లొకేషన్లకు నిలయమన్నారు. రాష్ట్రంలో షూటింగ్లు విజయవంతంగా జరుగుతున్నాయని, సింగిల్ విండో విధానం ద్వారా షూటింగ్లకు అనుమతులను వేగంగా జారీ చేస్తున్నామని తెలిపారు. తిరుపతి, వైజాగ్, అమరావతి ప్రాంతాల్లో స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ.. అవసరమైన భూములను కేటాయించేందుకు హామీ ఇచ్చారు. త్వరలోనే నంది అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తామని, నంది నాటకోత్సవాల నిర్వహణకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సినీ పరిశ్రమ తరలివచ్చి, ఇక్కడ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ