పల్నాడు పరువు హత్య జేసులో కీలక పరిణామం
పల్నాడు పరువు హత్య కేసులో సీఐని సస్పెండ్ చేశారు
పల్నాడు పరువు హత్య జేసులో కీలక పరిణామం


పల్నాడు, 05 ఏప్రిల్ (హి.స):పల్నాడు పరవు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాచర్ల సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా ఎస్పీ కృష్ణారావు.. వెంకటరమణను సస్పెండ్ చేశారు. చౌడేశ్వరి హత్యలో తల్లిదండ్రులతో పాటు సీఐ పాత్ర ఉందని తేలింది. చౌడేశ్వరి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని చౌడేశ్వరిని బలవంతంగా వారికి అప్పగించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే చౌడేశ్వరి హత్యకు కారణమైన వెంకటరమణపై ఎస్పీ కృష్ణారావు చర్యలు తీసుకున్నారు. సీఐని విధుల నుంచి తొలగించారు.

మాచర్లకు చెందిన చంద్రశీను, గంగ దంపతుల కుమార్తె చౌడేశ్వరి జమ్మలమడకకు చెందిన నాగరాజు ప్రేమించుకున్నారు. చంద్రశీను తన కూతురికి వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. నిశ్చితార్థానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చౌడేశ్వరి ఇంటినుంచి పారిపోయింది. ప్రియుడు నాగరాజును పెళ్లి చేసుకుంది. కూతురు ఇంటినుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకోవటం చంద్రశీనుకు నచ్చలేదు.

కూతురిని అప్పగిస్తే డబ్బులు ఇస్తానని మాచర్ల పోలీస్ స్టేషన్ సీఐ వెంకటరమణతో బేరం కుదుర్చుకున్నాడు. సీఐ వెంకటరమణ ఒప్పందం ప్రకారం చౌడేశ్వరిని బలవంతంగా కుటుంబసభ్యులకు అప్పగించాడు. వారు చౌడేశ్వరితో పాటు నాగరాజును కూడా ఇంటికి తీసుకెళ్లారు. చంద్రశీను, అతడి మేనల్లుడు పచ్చిపాల శీను .. చౌడేశ్వరిని చంపడానికి ప్లాన్ వేశారు. మార్చి 18వ తేదీన చంద్రశీను, పచ్చిపాల శీను నిద్రిస్తున్న చౌడేశ్వరిని దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande