
కడప , 05 ఏప్రిల్ (హి.స.)
అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం మన వంటిళ్లపై ప్రభావం చూపుతోంది. వంటగ్యాస్ సిలిండర్లు సకాలంలో లభించక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల రోజుల తరబడి పొయ్యిలే వెలిగించలేని పరిస్థితి నెలకొంది. కడప నగరంలోనూ పలువురు కార్యాలయాలకు వెళ్లి సిలిండర్ల కోసం పడిగాపులు పడుతున్నారు. పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) కనెక్షన్ వినియోగించుకుని ఉంటే ఈ తరహా ఇబ్బందులు కొందరికైనా తలెత్తేవి కావు. నెలవారీ గ్యాస్ ఖర్చులూ తగ్గేవి. ఈ విషయానికీ కడప నగరంలో రాజకీయ వేధింపులు తప్పలేదు. పీఎన్జీ గ్యాస్ పైపులైన్ వేసే కంపెనీని కమీషన్ల కోసం గతంలో ఇబ్బందులకు గురిచేశారు. నగర వాసులకు ఎంతో చేరువ కావాల్సిన ఈ గ్యాస్ పైపులైన్ను అడ్డుకున్నారు. ఫలితంగా చాలా కాలంపాటు పనులు ఆగిపోయాయి. అడ్డంకులు తొలగి తాజాగా మళ్లీ పట్టాలెక్కాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ