ఏప్రిల్ రెండోవారంలో ఇంటర్ ఫలితాలు
తెలంగాణ, ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 10 నుండి 12 మధ్య విడుదల కానున్నాయి
ఏప్రిల్ రెండోవారంలో ఇంటర్ ఫలితాలు


హైదరాబాద్, 05 ఏప్రిల్ (హి.స.) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇరు తెలుగు రాష్ట్రాల ఇంటర్ పరీక్షల (ఫస్ట్, సెకండ్ ఇయర్) ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో ప్రకటించేందుకు ఇరు రాష్ట్రాల విద్యాశాఖలు కృషి చేస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా పరీక్షల ఫలితాలను వెలువరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. మార్చి 18తో పరీక్షలు ముగియగా.. ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ బోర్డు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈ ఫలితాల తర్వాత పదో తరగతి రిజల్ట్స్ సైతం రానున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande