
హైదరాబాద్, 05 ఏప్రిల్ (హి.స.)
మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్వార్తలను (MP Etala Rajender) బీజేపీని వీడి ఇతర పార్టీలోకి చేరుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారాంపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందిస్తూ.. ఆ కొట్టిపారేశారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై జరుగుతున్నవి 'పిచ్చి ప్రచారాలు' అని మండిపడ్డారు. తాను, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభపార్టీ మారుతున్నామన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అలాగే పార్టీ మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులభం కాదని.. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు మా పార్టీలోనే కొందరు ఊతమివ్వడం విచారకరకరమని అన్నారు.
తాను పదవుల కోసం పద్దులు మోసే వ్యక్తిని కాదు అని ఈటల ఘాటుగా స్పందించారు. కేసీఆర్ తనను పార్టీ నుంచి బయటకు నెట్టి ఐదేళ్లు అవుతోందని, ఆనాడు తన గోడు వినేవారే లేరని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా 'హైడ్రా' పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టడం అరాచకమని ధ్వజమెత్తారు. జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..