ఈసీ, కాగ్ వంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి
ఈసీ, కాగ్ వంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నారు
ఈసీ, కాగ్ వంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి


ఢిల్లీ, 05 ఏప్రిల్ (హి.స.)భారత ఎన్నికల సంఘం(ఈసీఐ), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వంటి రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పని చేయాలని, వాటి సమగ్రత, ప్రజాస్వామిక పాలనను పరిక్షించేందుకు వాటిని రాజకీయ ప్రాబల్యం నుంచి దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు. పాట్నాలోని చాణక్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ‘హక్కులకు అతీతమైన రాజ్యాంగవాదం: నిర్మాణం ఎందుకు ముఖ్యం’ అనే అంశంపై జరిగిన స్మారకోపన్యాసంలో మాట్లాడుతూ సాధారణ రాజకీయ ప్రకియ తటస్థతను, జవాబుదారీతనాన్ని కల్పించలేని కీలక రంగాలను పర్యవేక్షించడానికి రాజ్యాంగం ఉద్దేశపూర్వకంగానే ప్రత్యేక సంస్థలను సృష్టించిందని జస్టిస్ నాగరత్న అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande