
నిర్మల్, 05 ఏప్రిల్ (హి.స.)
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. ఖానాపూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ కైవసం చేసుకుంది. చైర్ పర్సన్ అంకం మౌనిక నాలుగుకి ఎన్నికయ్యారు. మొత్తం 12 వార్డులుండగా.. బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలిచాయి. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండటంతో కాంగ్రెస్ బలం చేరింది. అనూహ్యంగా బీఆర్ఎస్..బీజేపీకి మద్దతివ్వడంతో ఖానాపూర్ చైర్మన్ పీఠం ఆ పార్టీ సొంతమైంది.
నిన్నటి వరకూ ఖాన్ పూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో... అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్షాలు చాలా వ్యూహాలే రచించాయి. శనివారమే ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావాల్సి ఉండగా.. పార్టీల సభ్యుల మధ్య చిన్న వివాదం రేగింది. దీంతో అధికారులు ఎన్నికను నేటికి వాయిదా వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..