ప్రజాపాలన కాదు.. ఇది ప్రజా పీడన: శాసనమండలి ప్రతిపక్ష నేత
సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన మధుసూదనాచారి
Mlc


వరంగల్, 05 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ భవిష్యత్ ను అగమ్యగోచరంగా చేస్తున్న అర్భకుడు రేవంత్ రెడ్డి అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుసూదనా చారి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అనే స్థాయిని మర్చిపోయి కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారు. నేను ఫ్లయిట్ ఏర్పాటు చేస్తాను, మా తెలంగాణకి వచ్చి గ్యారెంటీల అమలు చూడమంటున్నాడు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు చేశానని, చూపిస్తే తను హనుమకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటాను అన్నారు.

ముఖ్యమైన చర్చలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి శాసనమండలిలో ఉండకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. శాసన మండలిని సక్రమంగా నిర్వహించకుండా విఫలమయ్యారని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి అని అన్నారు. కాలేశ్వరం కట్టకముందు రాష్ట్రంలో పంటల దిగుబడి కాలేశ్వరం కట్టిన తర్వాత పంటలు తిరుగుబడి ఎలా ఉందో ప్రజలకు తెలుసు కాని కేంద్ర మంత్రి పార్లమెంటులో కాలేశ్వరం లక్ష కోట్లు నీళ్ల పాలు అని మాట్లాడడం ఆయన అవగాహన లేమికి నిదర్శనం అన్నారు. కడియం శ్రీ హరి ఏ పార్టీ యో, ఘన్పూర్ ప్రజల చేత రెఫరెండం పెట్టించాలి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande