
హైదరాబాద్, 05 ఏప్రిల్ (హి.స.) : సింగరేణిలో యూనియన్ బ్యాంకు కార్పొరేట్ శాలరీ అకౌంటు కలిగిన కార్మికులు, అధికారులు సహజ మరణం చెందినట్లయితే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఉచిత బీమా వర్తిస్తుందని బ్యాంకు యాజమాన్యం ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అమల్లో ఉన్న రూ.కోటి ప్రమాద బీమా పథకానికి ఇది అదనం. 2024లో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల కోసం ఉచితంగా రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు సహజ మరణానికి కూడా రూ.10 లక్షల బీమా కల్పించడం ద్వారా ఉద్యోగులకు మరింత మేలు చేకూర్చినట్లయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్