
నెల్లూరు, 05 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తమిళనాడు బోట్లు తిరగడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయినట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీ తీర ప్రాంతంలోని బంగాళాఖాతంలోకి ఆ రాష్ట్ర బోట్లు అక్రమంగా చొరబడి చేపల వేట చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తమిళనాడు బోట్లను ఎదుర్కొనేందుకు టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దింపినట్లు మంత్రి వెల్లడించారు. మన రాష్ట్ర మత్స్య సంపదను తమిళనాడు మత్స్యకారులు కొల్లగొడుతున్నారని.. అందుకే ఆధునిక స్పీడ్ బోట్ల సహాయంతో టాస్క్ ఫోర్స్ గస్తీ కాస్తోందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi