
అమరావతి, 05 ఏప్రిల్ (హి.స.)భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆజన్మాంతం కృషి చేసిన ధీరుడని ఆయన కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు ఆదివారం సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు.
విద్యార్థి దశ నుంచే అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించి, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప సామాజిక సంస్కర్త బాబూ జగ్జీవన్ రామ్ అని చంద్రబాబు ప్రశంసించారు. సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్గా పనిచేసి చట్టసభల్లో తన సత్తా చూపిన ఆయన, ఆఖరి క్షణం వరకూ దళిత జాతి సముద్ధరణ కోసమే తపించారు అని తన ట్వీట్లో పేర్కొన్నారు.. జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV