అంతర్జాతీయ వేదికగా తెలంగాణ అభివృద్ధి గాథను పంచుకున్న కేటీఆర్
తెలంగాణ గాథను అంతర్జాతీయ వేదికపై కేటీఆర్ చెప్పారు
అంతర్జాతీయ వేదికగా తెలంగాణ అభివృద్ధి గాథను పంచుకున్న కేటీఆర్


హైదరాబాద్, 05 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ అభివృద్ధి గాథను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతర్జాతీయ వేదికపై పంచుకున్నారు. అమెరికా న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026లో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర పురోగతిపై తన అనుభవాలను పంచుకున్నారు

పోరాటాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేవలం పదేళ్లలోనే దేశానికి మార్గదర్శకంగా నిలచే స్థాయికి ఎదిగామని పేర్కొన్నారు. వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ఆయన వివరించారు.ఈ కాన్ఫరెన్స్లో వ్యాపారం, ఆవిష్కరణలు, భవిష్యత్ విధానాలపై లోతైన చర్చ జరిగిందని కేటీఆర్ తెలిపారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు, నిపుణులతో జరిగిన సంభాషణలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి నమూనా అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande