మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ 2 ఏళ్లుగా లేఖలతోనే సరి
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్ధదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేసిన కూడా ప్రాజెక్టు ఇంజినీర్లు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ 2 ఏళ్లుగా లేఖలతోనే సరి


మేడిగడ్డ, ఏప్రిల్ 5 (హిం.స)

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్ధదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేసిన కూడా ప్రాజెక్టు ఇంజినీర్లు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయారు. కాళేశ్వరం ఈఎన్సీ నెల క్రితమే చీఫ్ ఇంజినీర్కు లెటర్ రాసిన ఇప్పటకీ దానిపై ఎటువంటి స్పందనా కనిపించలేదు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని ప్రభుత్వం స్పష్టత చేస్తున్నా ప్రాజెక్టు ఇంజినీర్లు మాత్రం ఈ దిశగా చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

నిర్మాణ సంస్థకు తుది నోటీసు జారీ చేయాలని తీసుకొన్న చర్యలను తమకు నివేదించాలని నీటిపారుదల శాఖ లేఖ రాసినా ప్రాజెక్టు ఇంజినీర్లు మాత్రం ఈ దిశగా చర్యలు తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖ ప్రాజెక్టు ఇంజినీర్లు రాసిన లేఖలన్నింటినీ జత చేసి చర్యలు తీసుకోవాలని, ఏం చర్యలు తీసుకొన్నది తమకు తెలపాలని, ఫిబ్రవరిలో ఈఎన్సీ కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్కు లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందన లేదని తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande