ఎమ్. పీ .డీ.వో కార్యాలయం వద్ద ని రసన
అనారోగ్య అన్నప్పటికి సెలవు ఇవ్వట్లేదు
ఎమ్. పీ .డీ.వో కార్యాలయం వద్ద ని రసన


అమరావతి, 05 ఏప్రిల్ (హి.స.)

పెనుగంచిప్రోలు, అనారోగ్యంగా ఉందని చెప్పినా వినకుండా అదనపు విధులు అప్పగిస్తూ ఇబ్బంది పెడుతున్నారని మహిళా పోలీసు ఆందోళన చేశారు. మండలంలోని వెంకటాపురం స్వర్ణ సచివాలయంలో తేజశ్రీ మహిళా విధులు నిర్వర్తిస్తున్నారు. సచివాలయ కార్యదర్శి అదనంగా విధులు అప్పగిస్తున్నారని, సెలవులు అడిగినా ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఎంపీడీవో కార్యాలయంలో సెలవు లెటర్ ఇచ్చినా తీసుకోవడం లేదని వాపోయారు. . అనంతరం ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యదర్శి కృష్ణను వివరణ కోరగా.. పై అధికారులు చెప్పిన విధులను ఆమెకు కేటాయించినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande