విరాళాలతో వైకుంఠరథం కొనుగోలు
గ్రామంలో అంతిమయాత్రకు వెళ్లడానికి ఇబ్బందుల నేపథ్యంలోవైకుఠరథాన్ని గ్రామస్థులే విరాళాలతో కొనుక్కున్నారు
విరాళాలతో వైకుంఠరథం కొనుగోలు


పెద్దపల్లి, 05 ఏప్రిల్ (హి.స.)

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో విరాళాలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని గ్రామస్తులకు ఆదివారం అందజేశారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే స్మశాన వాటిక స్థలం వరకు వెళ్లడానికి అంతిమయాత్రకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామంలోని కొందరు ‘మానవసేవయే మాధవ సేవ’ పేరా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వైకుంఠ రథానికి విరాళాలను సేకరించారు. విరాళాల రూపంలో వచ్చిన డబ్బులతో వైకుంఠ రథాన్ని కొనుగోలు చేసి ఆదివారం గ్రామస్తులకు అందజేశారు.

ఈ సమావేశంలో కరీంనగర్ కు చెందిన సామాజిక సేవకుడు, ప్రముఖ డాక్టర్ రఘురామన్ హాజరై విరాళాధాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవలోనే సరైన తృప్తి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విరాళా దాతలతో పాటు నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించారు. అలాగే ప్లాస్టిక్ నిషేధానికి బట్ట సంచులను డాక్టర్ రఘురామన్ అందజేసి, అవగాహన కల్పించారు. గ్రామంలో రూపాయి తీసుకోకుండానే వైకుంఠ రథం అందుబాటులో ఉంచుతామని గ్రామపంచాయతీ పాలకవర్గం తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande