గరుసపూడి పంచాయతీ అంబేద్కర్ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం
రోడ్ యాక్సిడెంట్ లో తండ్రి మృతి కుమారుడికి తీవ్ర గాయాలు
గరుసపూడి పంచాయతీ అంబేద్కర్ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం


గరిశపూడి, 08 ఏప్రిల్ (హి.స.)

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా.. కుమారుడికి గాయాలైన సంఘటన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గరిశపూడి పంచాయతీ అంబేడ్కర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై పైడిబాబు వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్లోని దిబ్బలపల్లెపాలెం గ్రామానికి చెందిన ఒడుగు బాలబాపూజీ(45), కుమారుడు కార్తీక్తో కలిసి విజయవాడ ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న కారు... ఎదురుగా వస్తున్న వారి ద్విచక్రవాహనాన్ని, తర్వాత వ్యాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనం రెండు ముక్కలైంది. దానిపై ప్రయాణిస్తున్న బాలబాపూజీ అక్కడికక్కడే మృతి చెందగా.. కార్తీక్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలబాపూజీకి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande