రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహదారులు, భవనాలు, రవాణాశాఖపై సచివాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు.
CM AP


అమరావతి, 08 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహదారులు, భవనాలు, రవాణాశాఖపై సచివాలయంలో ఈరోజు(బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై సమీక్షలో చర్చించారు. ఈ సమీక్షకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్ల పైచిలుకు రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande