ఎర్రవల్లి ఫాంహౌస్కు కేటీఆర్, హరీశ్... కేసీఆర్తో భేటీ
మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్, హరీశ్ రావు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ప్లీనరీ, జీవన్ రెడ్డి చేరికపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది
Meet BRS


హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు భేటీ అయ్యారు. ఈరోజు(బుధవారం) ఉదయం ఎర్రవల్లి ఫాంహౌస్కు చేరుకున్న మాజీ మంత్రులు.. కేసీఆర్తో కీలక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వహించడంపై ప్రధానంగా చర్చించారు. ఏప్రిల్ 27న ప్లీనరీ లేదా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించే యోచనలో గులాబీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్లీనరీ లేదా జనరల్ బాడీ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్తో భేటీ అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో చేరికపై కూడా నేటితో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్తో భేటీ అనంతరం జీవన్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ కలవనున్నారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ స్వయంగా ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఆపై కేసీఆర్తో జీవన్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా మాజీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయమే ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్తో కేటీఆర్, హరీశ్ భేటీ అయి చర్చించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande