ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఓ బాధిత కుటుంబానికి ప్రభుత్వం 8,25 లక్షలు
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద బాధితురాలికి సహాయం అందజేత
ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఓ బాధిత కుటుంబానికి ప్రభుత్వం 8,25 లక్షలు


అమరావతి, 08 ఏప్రిల్ (హి.స.)

జిల్లా సచివాలయం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం కింద ఓ బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.8.25 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని కలెక్టరేట్ ఆవరణలోని బ్యాంకులో కలెక్టర్ ఆనంద్ ఆదేశాల ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లికి చెందిన ఓ దళిత వ్యక్తి 2021లో హత్యకు గురయ్యారు. ఈ కేసు ఇప్పటికీ విచారణలో ఉంది. మృతుడి కుటుంబానికి తగిన సాయమందించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ -మానిటరింగ్ కమిటీ సభ్యుడు నెరమెట్ల ఎల్లన్న బాధితుల తరఫున కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పూర్వాపరాల పరిశీలన అనంతరం కలెక్టర్ ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి పైమొత్తాన్ని మంజూరు చేయించారు. బాధిత కుటుంబానికి సాయమందించిన కలెక్టర్కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande