ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసిపి నాయకుల దాడి గర్హనీయం
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై దాడి ఖండించిన జర్నలిస్టు సంఘాలు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసిపి నాయకుల దాడి గర్హనీయం


అమరావతి, 08 ఏప్రిల్ (హి.స.)

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ నాయకులు దాడికి పాల్పడటం గర్హనీయమని జర్నలిస్టు సం ఘాలు పేర్కొన్నాయి. తమకు నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసిన మీడి యా సంస్థలు, జర్నలిస్టులపై దాడులకు దిగడం అప్రజాస్వామికమని పేర్కొన్నాయి. దాడిని భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా భావించాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఓ ప్రకటన విడుదల చేసింది . ఏబీఎన్ ప్రసారాల్లో, ఆంధ్రజ్యోతి పత్రికలో తమకు నచ్చని వార్తలు ఉంటే వాటిపై స్పందించే పద్ధతి ఇది కాదని వైసీపీ నేతలకు హితవు పలికారు. రాజకీయ పార్టీకి చెందిన నేతలు బహిరంగ చర్చను ఆశ్లీల పదజాలంతో కలుషితం చేయడం, వాదనలను భౌతిక దాడుల స్థాయికి దిగజార్చడం తగదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande