తిరుమల ప్రసాదాల నాణ్యతలో మార్పులు
శ్రీవారి ప్రసాదం నాణ్యత లో చాలా మార్పులు వచ్చాయి
తిరుమల ప్రసాదాల నాణ్యతలో మార్పులు


తిరుమల, 08 ఏప్రిల్ (హి.స.)

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో చాలా మార్పు వచ్చిందని, ప్రసాదాలు ప్రస్తుతం చాలా రుచికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. తిరుమల శ్రీవారిని అర్చన సేవలో ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరిని వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమల, తిరుపతిలో చేపట్టిన ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధవాతావరణం తొలగిపోయి శాంతి నెలకొల్పాలని స్వామిని ప్రార్థించానన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande