
అమరావతి, 08 ఏప్రిల్ (హి.స.)తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరోసారి వర్షసూచన జారీ చేసింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు పడనున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఇక పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని ప్రజలను హెచ్చరించింది.
అటు ఏపీలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మరోవైపు ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణకు మూడ్రోజుల వర్షసూచన
ఇక తెలంగాణకు మూడ్రోజుల పాటు భారీ వర్షసూచన జారీ చేసింది. మలుగు, ఖమ్మం, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, వరంగల్, నల్లగొండ జిల్లా్లలో వానలు పడతాయని హెచ్చరించింది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక మూడ్రోజుల తర్వాత తెలంగాణలో ఎండలు మొదలుకానున్నాయి. . ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV