తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 6 గంటల సమయం!
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది
తిరుమల


తిరుమల, 08 ఏప్రిల్ (హి.స.)

కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల (Tirumala)లో భక్తుల రాక నిలకడగానే కొనసాగుతోంది. నేడు (ఏప్రిల్ 8, 2026) శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 6 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. దీంతో SSD టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ (TTD) సిబ్బంది నిరంతరాయంగా అన్నప్రసాదం, పాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు.

భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి రూ. 4.38 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande