అంతర్జాతీయ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
chandra babu


అమరావతి, 01 మే (హి.స.)

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక, కర్షక సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తే దేశం ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. కార్మిక సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు

‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక, కర్షక సోదరులకు శుభాకాంక్షలు. వృత్తి ఏదైనా శ్రమించే ప్రతి మనిషికి సమాన గౌరవం ఇవ్వడం మన కర్తవ్యం. అహర్నిశలు శ్రమిస్తున్న శ్రామిక వర్గ హక్కులను గుర్తించే చరిత్రాత్మక దినోత్సవం ఇది. దేశ ఆర్థిక పురోగతికి వెన్నెముక అయిన వ్యవసాయం ముందుకు వెళ్తుందంటే రైతులు, రైతు కూలీల శ్రమ శక్తే కారణం. కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తేనే దేశం ప్రగతి పథంలో ముందుకు వెళుతుంది. అందుకే కార్మిక, కర్షక సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనునిత్యం ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తోంది.. ముందడుగు వేస్తోంది. కార్మిక లోకం కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది’ అంటూ చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande