
హైదరాబాద్, 02 మే (హి.స.)
తెలంగాణ రాష్ట్ర నూతనడైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బాధ్యతలు స్వీకరించిన సి.వి.ఆనంద్ (CV Anand) శనివారం లోక్ భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను (Shiv Pratap Shukla) మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గవర్నర్కు ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టినందుకు సి.వి.ఆనందన్ను గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిద్దరి మధ్య కాసేపు అధికారిక చర్చలు జరిగాయి. కాగా డీజీపీగా శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నూతన డీజీపీగా సీవీ ఆనంద్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నిన్న ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..