రోడ్డు ప్రమాదాల నివారణకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
రోడ్డు ప్రమాదాల నివారణకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
Ponnam


హైదరాబాద్, 02 మే (హి.స.)

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్కు (Vikas Raj) మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదేశించారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, మరణాల సంఖ్య నివారించడానికి ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వినూత్న కార్యక్రమం చేపడుతూ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యగా రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలలో ప్రత్యేకంగా కేటాయించిన వేదికలపై ప్రమాదానికి గురైన వాహనాలను హెచ్చరిక సూచికలతో ప్రదర్శించాలని ఆదేశించారు. අධි డ్రైవర్లకు, ప్రయాణికులకు యాక్సిడెంట్స్ స్పాట్ దగ్గర హెచ్చరికగా పనిచేస్తూ, రహదారి భద్రతపై అవగాహన కల్పించి, ప్రాణాంతక ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. అమూల్యమైన ప్రజల ప్రాణాలను కాపాడటానికి, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో అటువంటి డిస్ ప్లేలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande