
అమరావతి, 01 మే (హి.స.)
సంతకవిటి: విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మిర్తివలసలో విషాదం చోటు చేసుకుంది. తమ్ముడి వివాహం రోజే విద్యుదాఘాతంతో అన్న మృతి చెందాడు. మేడపై దుస్తులు ఆరేస్తుండగా పెళ్లి డెకరేషన్కు ఏర్పాటు చేసిన విద్యుత్వైర్లు తగిలి సతీశ్ (32) అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గుర్తించిన బంధువులు హుటాహుటిన శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. సతీశ్కు ఏడాది క్రితం వివాహమైంది. ఆయన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. కుమారుడి మృతితో ఒక్కసారిగా పెళ్లింట విషాదం అలముకుంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ