ఏపి రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు
ఏపి రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు
ఏపి రాజధాని అమరావతిలో బసవతారకం  క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు


అమరావతి, 01 మే (హి.స.)

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణపనులను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. రూ.750 కోట్లతో తుళ్లూరు సమీపంలో ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం ఏపీ ప్రభుత్వం 21 ఎకరాల భూమిని కేటాయించింది. మొదటి దశలో 500 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఈసందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని పనులు ప్రారంభించినట్లు చెప్పారు. అమరావతిలో ఆస్పత్రి సేవల కోసం అందరూ ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ‘‘అంతర్జాతీయ ప్రమాణాలతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటుచేస్తున్నాం. హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జూన్ 22న భారీ కార్యక్రమం ఏర్పాటుచేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నాం’’ అని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande