కార్మికుల పోరాటమే మేడే కు స్ఫూర్తి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కార్మికుల పోరాటమే మేడే కు స్ఫూర్తి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Whip


వేములవాడ, 01 మే (హి.స.)

అన్ని రంగాల కార్మికులకు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మే డే సందర్భంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో వేడుకలను శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితే హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. మే డే వేడుకలు ఆనాడు కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి స్పూర్తిగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్మికుల కష్టం, చెమట చుక్కలతో రూపు దిద్దుకున్న వస్తువులను మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్ల కోసం అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. దేశంలోని ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కార్మికుల శ్రమ వల్ల నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని వివరించారు. వేలాది మంది కార్మికులు పని చేస్తున్న ఆర్టీసీలో ఉన్న సమస్యలను మూడు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ముంగిపు పలికారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఐటీఐ లను ఏటీసిలుగా అప్ గ్రేడ్ చేసిందని వెల్లడించారు. రతన్ టాటా వారితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి.. నూతన టెక్నాలజీకి అనుగుణంగా మండేపల్లి, రుద్రంగికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు మంజూరు చేశారని వెల్లడించారు. కార్మిక శాఖ ఆద్వర్యంలో అందించే వివిధ పథకాలు వినియోగించాలని పిలుపు నిచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande