
కామారెడ్డి, 01 మే (హి.స.)
చిన్నారుల్లో లోపాలను ప్రారంభంలోనే గుర్తించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో 'బాల భరోసా' కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన-ప్రగతి నివేదిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ-పోషణ అభియాన్, ఆరోగ్య శాఖ-RBSK సంయుక్తంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ 0-5 ఏళ్లలోపు చిన్నారుల్లో పెరుగుదల లోపాలు, అంగవైకల్యాలు, మానసిక సమస్యలను ప్రారంభంలోనే గుర్తించి వైద్య సేవలు అందిస్తే సాధారణ స్థితికి తీసుకురావచ్చన్నారు. జిల్లాలోని 13 ఆర్బీఎస్కే బృందాలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, 42 ప్రశ్నల ఆధారంగా గుర్తించిన చిన్నారులకు పరీక్షలు నిర్వహించాయి. మొదటి రోజు 31 మంది చిన్నారులకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స, మందులు అందజేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..