
భూపాలపల్లి, 01 మే (హి.స.)
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లో జరిగే సరస్వతి అంత్య పుష్కరాలకు వివిధ రాష్ట్రాల్లోని భక్తులు రావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖమంత్రి కోరారు. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగే ఈ పుష్కరాలకు ప్రత్యేకత ఉందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదావరి నదిలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదిలో స్నానం ఆచరించి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకుని వారి ఆశీర్వాదం పొందాలని ఆయన కోరారు. ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల 21వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు జరిగే సరస్వతి అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని భక్తులంతా రావాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సైతం పుష్కాలకు 10 రోజుల ముందే అన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..