అన్నవరం సత్యదేవుని వైభవంగా.రథోత్సవం
అన్నవరం సత్యదేవుని వైభవంగా.రథోత్సవం 😊
అన్నవరం సత్యదేవుని వైభవంగా.రథోత్సవం


అన్నవరం, 01 మే (హి.స.)అన్నవరం సత్యదేవుని రథోత్సవం వైభవంగా జరిగింది. జై సత్యదేవా అంటూ స్వామి నామస్మరణ చేస్తూ.. రథాన్ని ముందుకు లాగుతూ.. భక్తజనం పరవశించారు. వేదమంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్లను అర్చకులు కొండపై నుంచి దిగువన తొలిపావంచాల వద్దకు మధ్యాహ్నం 3 గంటలకు తెచ్చారు. పుష్పాలంకరణ అనంతరం 4 గంటలకు ఉత్సవమూర్తులను రథంపై ఆశీనులను చేశారు. ఛైర్మన్ రోహిత్, ఈవో చక్రధరరావు టెంకాయ కొట్టి రథాన్ని ముందుకు లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. గ్రామంలోని తొలిపావంచాల వద్ద ప్రారంభమై వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద కూడలి నుంచి వెనక్కి మళ్లించారు. అక్కడ నుంచి టోల్గేటు వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడ నుంచి వెనక్కి తొలిపావంచాల వద్దకు రథం చేరుకుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా కమిషనర్ నియమించిన పర్యవేక్షణాధికారి, లోవ దేవస్థానం ఈవో విశ్వనాథరాజు, దేవస్థానం అధికారులు పర్యవేక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande