ఎన్టీఆర్. జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా నదిలో. శ్రీరాముడి పంచలోహ విగ్రహం.లభ్యం
ఎన్టీఆర్. జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా నదిలో. శ్రీరాముడి పంచలోహ విగ్రహం.లభ్యం
ఎన్టీఆర్. జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా నదిలో. శ్రీరాముడి పంచలోహ విగ్రహం.లభ్యం


చందర్లపాడు, 01 మే (హి.స.)

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా నదిలో శ్రీరాముడి పంచలోహ విగ్రహం లభ్యమైంది. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న గుడిమెట్ల కొండల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. అదేవిధంగా తవ్వకాల్లో అరుదుగా విగ్రహాలు లభ్యమవుతుంటాయి. ఉమ్మడి ఏపీలో 20 ఏళ్ల క్రితం రామన్నపేట కొండల్లో నిర్మాణాలకు తవ్వకాలు చేస్తుండగా పంచ లోహ లక్ష్మీదేవి విగ్రహం దొరికింది. దీనిని అప్పటి సీఎం చంద్రబాబునాయుడి సమక్షంలో ప్రభుత్వానికి అప్పగించారు. ఇక్కడి కొండల్లో వజ్రాల అన్వేషణకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. వర్షాకాలం సమయంలో ఎక్కువ మంది రావడం వల్ల సందడి నెలకొంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కొండ పక్కనే నదిలో స్నానం చేసేందుకు దిగిన సమయంలో ఈ విగ్రహం దొరికింది. గ్రామాల్లో తిరుగుతూ చీపుర్లు అమ్ముకునే వారు నదిలో స్నానానికి దిగిన సమయంలో శ్రీరాముడి పంచలోహ విగ్రహం లభ్యం లభ్యమైంది. పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే గ్రామానికి వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై పోలీసులు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande