వేసవి కల్పతరువు తాటి ముంజలు – పెరిగిన గిరాకీ
వేసవి కల్పతరువు తాటి ముంజలు – పెరిగిన గిరాకీ
demand-for-palm-fronds-increased-during-summer


ఎమ్మిగనూరు (కర్నూలు), 01 మే (హి.స.) :

ప్ర స్తుతం ఎండలు విపరీతంగా మండుతున్నా యి. ఎండవేడిమికి జనం విలవిల్లాడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు పలు దారులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో తాటి ముంజలకు భ లే డిమాండ్ ఏర్పడింది. ఎండలకు తాటిముంజలు తింటే చలవ చేస్తుందని ప్రజలు వాటి కోనుగోలుకు ఎగబడుతున్నారు. దీంతో వాటికి డిమాండ్ పెరిగింది.

వేసవి కల్పతరువు తాటి ముంజలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనేక పోషకాల గనిగా మన పూర్వికులు పిలిచేవారు. వేసవికాలంలోనే పిలిచే ఈ తాటి ముంజలు వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎమ్మినూరు పట్టణంలో ఈ పరిసరాల నుండి గ్రామాల్లోని వ్యాపారులు చెట్ల నుండి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.

వీటి ధర (12) డజన్ 60 రూపాయల నుండి 80 రూపాయల వరకు పలుకుతుంది. తాటి ముంజల పై అవగాహన పెరగడంతో కొనుగోలు స్థాయి పెరిగింది. ఈ ప్రాంతంలో పెద్దకడబూరు, పెద్ద తుంబలం, కోసిగి , పార్లపల్లి గ్రామాల నుండి మంజులను తీసుకొచ్చి విక్రయిస్తారు. ఈ తాటి ముంజలు ఎలాంటి కెమికల్స్ లేకుండా పండటంతో ఇవి ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతాయి. వేసవిలో పండ్ల రసాలు ఇచ్చే శక్తి తాటి ముంజలు తీసుకుంటే వస్తుంది. విటమిన్ ఏ బి సి తోపాటు ఐరన్ జింక్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. తాటి ముంజలు శరీరంలో మలినాలను బయటికి పంపుతాయని, వేసవిలో అలసటను తొలగించి ఉపశమనాన్ని కలిగిస్తాయని, మలబద్ధక నివారణతో పాటు అజీర్తి సమస్యలు దరిచేరవని, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయని, బరువు తగ్గడంలో కూడా సహకరిస్తుందని వైద్యులు పేర్కొనడంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఆయుర్వేద నిపుణులు సూచనలతో తాటి ముంజల వ్యాపారం విరివిగా పెరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande