కర్నూలు: జిల్లాలో రూ. 103. 90 కోట్ల పెన్షన్ల పంపిణీ
కర్నూలు: జిల్లాలో రూ. 103. 90 కోట్ల పెన్షన్ల పంపిణీ
kurnool/kurnool-pensions-worth-rs-103-90-crore-distributed


కర్నూలు, 01 మే (హి.స.)

కర్నూలు జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల ఇంటికే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. మే మాసంలో మొత్తం 2,35,260 మంది లబ్ధిదారులకు రూ.103.90 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం లేబర్ కాలనీలో కలెక్టర్ స్వయంగా వృద్ధాప్య, వైకల్య, వితంతు పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. వారితో ఆత్మీయంగా మాట్లాడుతూ వారి యోగక్షేమాలను, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఆదోని: పింఛన్లను పంపిణీ చేసిన కురుబ కార్పొరేషన్ చైర్మన్

ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో శుక్రవారం కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే పింఛన్లు అందించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలపై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనమని దేవేంద్రప్ప అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆర్థికంగా అండగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం అమలు చేస్తోందని తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande