అనంతపురం - రాచూరు గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి సవిత
అనంతపురం - రాచూరు గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి సవిత
minister-savita-distributed-pensions-in-rachuru-village-16700126


minister-savita-distributed-pensions-in-rachuru-village-16700126


అనంతపురం, 01 మే (హి.స.)

రొద్దం మండలం రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఆమె ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఆనందరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అనంతపురంలోని 4వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఆర్టిసి జోనల్ చైర్మన్ పూల నాగరాజు, కమిషనర్ జస్వంత్ కుమార్, మరియు టిడిపి నాయకులు కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించబడింది.

ధర్మవరం పట్టణంలో శుక్రవారం ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ హాజరై, లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నేరుగా పెన్షన్ డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande