వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలలో అల్పాహారం, ఇంటర్ కళాశాలలలో మధ్యాహ్న భోజనం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలలో అల్పాహారం, ఇంటర్ కళాశాలలలో మధ్యాహ్న భోజనం
Collector


జోగులాంబ గద్వాల, 01 మే (హి.స.)

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అధికార 99 రోజుల కార్యక్రమానికి సంబంధించి మే రెండో తేదీన నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం గూగుల్ సమావేశంలో జిల్లాలోని యంత్రాంగంతో కలెక్టర్ మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలన్నారు. గృహ జ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను ఈ సమావేశంలో తెలియజేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలలో అల్పాహారం, ఇంటర్ కళాశాలలలో మధ్యాహ్న భోజనం, ఇందిరమ్మ జీవిత బీమా, తదితర కొత్త పథకాల గురించి కూడా తెలియజేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల స్థాయి సమావేశాలు, వివిధ శాఖల వారోత్సవాల కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలతో ఛాయాచిత్ర ప్రదర్శన, ముఖ్యమైన శాఖల స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గస్థాయి కార్యక్రమాల్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా, వరి

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు తమ పరిధిలోని ఫర్టిలైజర్ దుకాణాలను తరచు తనిఖీలు చేయాలని, నానో యూరియాపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకనుంచి ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలోనూ కార్యక్రమాన్ని ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. . ఈనెల 4వ తేదీ నుంచి నిర్వహించే రైతు వారము కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని, అన్ని రైతు వేదికలలో రైతులకు పంటల మార్పిడి, నానో యూరియా వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande